ANDHRA PRADESHOFFICIALPROBLEMS

తెరుచుకోని సచివాలయం తలుపులు

సచివాలయ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

తెరుచుకోని సచివాలయం తలుపులు

సచివాలయ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

కొత్తపల్లి అక్టోబర్ 10 యువతరం న్యూస్:

మండలంలోని ఎర్రమఠం గ్రామం సచివాలయంలో సిబ్బంది ఎవ్వరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య సచివాలయంలో ఎవ్వరూ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కంప్యూటర్ గదికి తాళం వేసి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్ కుమార్ వివరణ కోరగా ప్రస్తుతం ఆయన శ్రీశైలం ప్రత్యేక డ్యూటీలో ఉన్నానని, ఆయనతో పాటు నలుగురు మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నారని, ఒక్కరు సెలవు పై వెళ్లగా మిగతా ముగ్గురు ఎర్రమఠం చెంచుగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు వెళ్లారని ఆయన చెప్పారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!