ANDHRA PRADESHEDUCATIONPROBLEMS

ఉపాధ్యాయుడి పై దాడి చేయడం నీతిమాలిన చర్య

ఉపాధ్యాయుడి పై దాడి చేయడం నీతిమాలిన చర్య

జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు)

ఆత్మకూరు ప్రతినిధి అక్టోబర్ 10 యువతరం న్యూస్:

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడిపై పాఠశాలలో దాడి చేయడం హేయమైన చర్య,అమానుషం అని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఆత్మకూరు పట్టణంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జవహర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ
గోనెగండ్ల మండలంలోని, గాజులదిన్నె గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు పనిచేయుచున్న ఉపాధ్యాయుడు చెన్న. బసవరాజుపై అదే పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి యొక్క తండ్రి ఈరోజు ఉదయం ఆకస్మికంగా దాడి చేయడం,అమానుష చర్య అని దీనిని రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుడిపై
దాడి చేసిన విద్యార్థి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని
మరియు ఇటువంటి చర్యలు పాఠశాలల్లో పునరావృతం కాకుండా ఉపాధ్యాయుల రక్షణకై కఠిన చట్టాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!