ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం
జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు


ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం
జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు
వెల్దుర్తి అక్టోబర్ 10 యువతరం న్యూస్:
ఈనెల 16న తలపెట్టిన దేశ ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ మరియు బుక్కు కీపర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాకు మోడీ రావడం మన అదృష్టం అన్నారు. మోడీ పర్యటన విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. వెల్దుర్తి మండలానికి ఉపాధి హామీ తరపున 80 బస్సులు, పొదుపు సంఘం తరఫున 80 బస్సులు వస్తున్నాయన్నారు. ఆయా గ్రామాలలో సంబంధిత వ్యక్తులు బాధ్యత తీసుకొని కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుహాసినమ్మ, ఏపీఓ లక్ష్మన్న, ఏపీఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు.



