ప్రధానమంత్రి సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి


ప్రధానమంత్రి సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
మూడు లక్షల మంది సభకు హాజరు
పదివేల బస్సుల కు పార్కింగ్ సౌకర్యం
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు కలెక్టరేట్ అక్టోబర్ 10 యువతరం న్యూస్:
ఈనెల 16న జరిగే ప్రధానమంత్రి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శుక్రవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 16న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా ఓర్వకల్ ఏర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి శ్రీశైలం వెళ్లి దర్శనానంతరం నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగ మయూరి వెంచర్ లో ఏర్పాటుచేసిన” సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ” బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభ 40 ఎకరములలో మూడు లక్షల మంది సమావేశంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని , 347 ఎకరాలలో 10వేల బస్సులు నిలుపుకునే విధంగా 12 పార్కింగ్ పాయింట్స్ లు ఏర్పాటు చేయడం జరిగిందని , అన్ని పార్కింగ్ పాయింట్లు జాతీయ రహదారి కి అనుసంధానం చేసే విధంగా అంతర్గత రహదారులు కూడా నిర్మించడం రేపు సాయంకాలానికి పూర్తవుతుందని తెలిపారు. పబ్లిక్ మీటింగ్ కు వచ్చిన ప్రజలందరికీ 15 లక్షల లీటర్ల త్రాగునీరు , మజ్జిగ , భోజనం మరియు అవసరమైన వైద్య సదుపాయాలు, టాయిలెట్స్ ఏర్పాట్లు ఉంటాయని తెలియజేశారు.



