8న యూపీహెచ్సీలో రోటరీ మహిళా దినోత్సవ వేడుకలు

8 యూపీహెచ్సీలో రోటరీ మహిళా దినోత్సవ వేడుకలు
మంగళగిరి ప్రతిననిధి మార్చి 7 యువతరం న్యూస్:
మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పరిష్కరించుకొని ఈనెల 8వ తేదీన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతాయని రోటరీ అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు, అందే మురళీమోహనరావు తెలిపారు. ముఖ్య అతిథులుగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివరంజని, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ హోమ్ క్లబ్ జిల్లా అధ్యక్షురాలు అన్నే శివకుమారి, సికే హైస్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ఐవీఎస్ వరలక్ష్మి హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష, హెల్త్ సెంటర్ వైద్య సిబ్బందిని సత్కరించడం జరుగుతుందన్నారు. హెల్త్ సెంటర్ కు రోటరీ తరఫున వైద్య పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు.