డ్రోన్ గస్తీతో ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతున్న మంగళగిరి రూరల్ పోలీసులు

డ్రోన్ గస్తీతో ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతున్న మంగళగిరి రూరల్ పోలీసులు
మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్
మంగళగిరి ప్రతినిధి మార్చి 7 యువతరం న్యూస్:
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ , నార్త్ డిఎస్పి సి హెచ్ మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం మంగళగిరి మండలం నవులూరు గ్రామ ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ నిర్వహించి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న మంగళ గిరి రూరల్ ఎస్ఐ వేంకటేశ్వర్లు సిబ్బంది.
ప్రజా శాంతికి, వారి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఓపెన్ డ్రింకింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని,గుంటూరు జిల్లాలోనీ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇక నుండి నిరంతర డ్రోన్ గస్తీ నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఓపెన్ డ్రింకింగ్ చేస్తే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు శ్రీ ఎస్పీ తెలిపారు.