ANDHRA PRADESHOFFICIALWORLD

వాల్మీకి (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చండి

వాల్మీకి (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చండి

అసెంబ్లీలో ప్రస్తావించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ప్రతినిధి మార్చి 06 యువతరం న్యూస్:

రాయలసీమలో కనీసం జీవనం గడవడానికి ఇబ్బంది పడుతూ అత్యంత వెనుకబడిన వాల్మీకి (బోయ) కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

శాసనసభ సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీలో జరిగిన జీరో అవర్ లో వాల్మీకి వెనుకబాటుతనంపై ప్రస్తావిస్తూ వారిని ఎస్టీ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వం చెర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సభ ద్వారా విన్నవించారు. రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయ కుటుంబాల వారు రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగపరంగా మరియు అన్ని రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని అలాంటివారు చాలామంది ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసలు వెళ్లారని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకొచ్చారు కనీసం వీరిని ఎస్టీ జాబితాలోకి చేరిస్తే వారి జీవన ప్రమాణాలు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయని తెలిపారు రాష్ట్రంలో తూర్పు పశ్చిమ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో ఉన్న వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్నారని రాయలసీమలో ఉన్న వాల్మీకి బోయ కుటుంబాలు బీసీ జాబితాలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వెల్లడించారు. అదేవిధంగా పక్కన ఉన్న కర్ణాటకలో వాల్మీకులు (బోయ) ఎస్టి జాబితాలో ఉన్నారని తెలిపారు. 2014 టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఆలోచనతో సత్యపాల్ కమిటీ వేశారని తెలిపారు అంతేకాకుండా వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపారని అది ఇప్పటివరకు నెరవేరలేదని ఎమ్మెల్యే సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని ఇప్పటికైనా వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలోకి చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సభ ద్వారా కోరారు.
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మంత్రి అచ్చెం నాయుడు సమాధానం ఇస్తూ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి గారు వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని అంశం చాలా మంచి విషయాన్ని అడిగారని మంత్రి అభినందించారు . ఇది గత టిడిపి హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి అప్పటి మంత్రి కాల్వ శ్రీనివాసులు ఢిల్లీలో ఈ విషయంపై అప్పటి కేంద్ర మంత్రులతో తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు . టిడిపి ఓడిపోయి వైసిపి అధికారంలోకి రావడంతో అది మరుగున పడింది అన్నారు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఆ కులాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని ఎన్డీఏ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి వారి చిరకాల కోరిక నెరవేరేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!