బండలాగుడు పోటీలను ప్రారంభించిన కర్నూల్ రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్, ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్, కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు తిక్కారెడ్డి
శైలజ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు

బొమ్మిరెడ్డి పల్లెలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కే.ఈ శ్యామ్ కుమార్, కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు తిక్కారెడ్డి
వెల్దుర్తి ఫిబ్రవరి 4 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలం లోని బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ పామయ్య తాత తిరుణాల సందర్భంగా అఖిలభారత ఒంగోలు జాతి కోడెల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్,కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు తిక్కారెడ్డి, జిల్లా తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ప్రారంభించారు. బండలాగుడు పోటీలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి పల్లె రామాంజనేయులు,మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ తో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.