కర్నూలు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ

వైసిపి నేత ఎరుకల లింగన్న వర్గం టిడిపిలో చేరిక
కోడుమూరు లో వైసీపీకి గట్టిగా ఎదురు దెబ్బ
కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో 300 కుటుంబాలు టిడిపి తీర్థం
కోడుమూరు జనవరి 4 యువతరం న్యూస్:
కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచర వర్గం ఎరుకల లింగన్న తో పాటు 300 కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి టిడిపి శాసనసభ్యులు, జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలకు ఆహ్వానించారు.కున్నూరు, మాచాపురం, పులకుర్తి, పి.కోటకొండ, గోరంట్ల తదితర గ్రామాలకు చెందిన వైసిపి కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎరుకల లింగన్న ఆధ్వర్యంలో దాదాపు 20 వాహనాలలో వెళ్లి టిడిపి కండువాలు కప్పుకున్నారు. కోడుమూరు టిడిపి నేతలు మాజీ సర్పంచ్ సీబీ లతమ్మ, మధు రెడ్డి, పరమేశ్వర రెడ్డి, హేమాద్రి రెడ్డి, రాంబాబు, మల్లి గౌడ్ లు వీరిని టీడీపీ లో చేర్పించడానికి కృషి చేశారు. ఈ చేరికలతో కోడుమూరులో వైసీపీకి భారీగా షాక్ తగిలిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎరుకల లింగన్న వర్గం చేరికతో కోడుమూరు నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన చెందారు. అయినా ప్రజలు టీడీపీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్న తీరు ప్రపంచ దేశాల ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలనే కాకుండా రాజకీయ ప్రముఖులను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైసిపి కి భవిష్యత్తు లేదని ఆ పార్టీ నేతలు గ్రహించారని కోట్ల అన్నారు. దీని కారణంగా వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. టీడీపీలో చేరిన వారిలో ఎరుకలి నాగరాజు, ఎరుకలి నర్సి, ఎరుకలి మద్దిలేటి, ఎరుకలి ఎల్ల కృష్ణ, ఎరుకలి రవి కుమార్, ఎరుకలి శ్రీను, ఎరుకలి ఆనంద్, ఎరుకలి ధనుంజయ్, ఎరుకలి కోనయ్య, మచాపురం చంద్ర, క్యాబి నర్సి,నాగరాజు తదితర గ్రామాల ప్రజలు చేరారు.