ANDHRA PRADESHSOCIAL SERVICESTATE NEWS

అక్షయపాత్ర కిచెన్ సందర్శించిన నారా భువనేశ్వరి

అక్షయ పాత్ర కిచెన్ సందర్శించిన నారా భువనేశ్వరి

మంగళగిరి ప్రతినిధి జనవరి 25 యువతరం న్యూస్:

మంగళగిరి మండలం ఆత్మ కూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ యొక్క సెంట్రలైజడ్ కిచెన్ (కేంద్రీకృత వంటశాల) ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ప్రభుత్వ మధ్యాహ్న భోజనం ఎండిఎం పధకమైన “డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం” ద్వారా 30,000 మంది పిల్లలకు ఇక్కడి నుండి దాదాపు 25 వాహనాలతో ఇన్సు లేటెడ్ కంటైనర్లలో ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తుంది అన్నారు.అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ, ఇది భారతదేశంలో మధ్యాహ్న భోజనం ద్వారా పిల్లల పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ-సహాయక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం ద్వా రా, అక్షయపాత్ర ఆకలిని పోగొట్టడం ప్రతిరోజు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది అన్నారు. ఇక్కడకు రావటం చాల సంతోషమగా ఉందన్నారు అలాగే శుక్రవారం వారు బియ్యం శుభ్రపరిచే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ యంత్రం ద్వా రా బియ్యం నాణ్యత శుభ్రపరచే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది పిల్లలకు అత్యంత నాణ్యమైన ఆహారాన్ని పొందడానికి సహాయపడుతుంది.
ఈ  సందర్భంగా అక్షయ పాత్ర మంగళగిరి ప్రెసిడెంట్ వంశీధర దాస మాట్లాడుతూ, ఆచార్యులు జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారి ఆశయాలతో 1500 మందితో ప్రారంభమైన మధ్యాహ్న భోజన కార్యక్రమం ద్వారా అక్షయ పాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతంలోని దాదాపు 20,000 పైగా పాఠశాలల 24 లక్షల పైగా పిల్లలకు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తోంది. నారా భువనేశ్వరి చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు, ఆమె ఈరోజు అక్షయపాత్రను సందర్శించి, రైస్ క్లీనింగ్ మెషీన్‌ను ప్రారంభించినందుకు ధన్యవాదాలు తేలిపారు. ఈ  కార్య క్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, విలాస విగ్రహ దాస, రఘునందన్ దాస,టిటిడి పాలకమండల సభ్యులు తమ్మిశెట్టి జానకి దేవి,మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి వింజమూరి ఆశాభాల, నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, దుగ్గిరాల మండల టిడిపి అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మంగళగిరి మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ, తాడేపల్లి మండల టిడిపి అధ్యక్షురాలు బోర్ర కృష్ణ వందన మరియు తెలుగుదేశం కార్యకర్తలు, అక్షయ పాత్ర సిబ్బంది పాల్గొన్నా రు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!