మందకృష్ణ మాదిగ పై అనుచిత వ్యాఖ్యలును ఖండించిన ఎం.ఎస్.పి

మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలును ఖండించిన ఏం, ఎస్, పి
ములుగు ప్రతినిధి జనవరి 22 యువతరం న్యూస్:
మందకృష్ణ మాదిగ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పశువుల రామ్మూర్తి పై చట్టపరంగా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వాజేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెన్నం స్వామి మాదిగ ఆధ్వర్యంలో
మందకృష్ణ మాదిగ ని చంపుతామని పేపర్ ప్రకటన ద్వారా మాట్లాడిన
మరియు ఎమ్మార్పీఎస్ పోరాటానికి గత 30ఏళ్లగ వర్గీకరణ ఉద్యమానికి మద్దతిస్తున్న, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా ఈ దేశం నుంచి బహిష్కరించాలని అవమానపరిచిన పశువుల రామ్మూర్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు వాజేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు,
ఇకనుండి ఎవరైనా ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడిన అవాకు చవాకులు పేలిన వారిపై ఎమ్మార్పీఎస్ నాయకత్వం ప్రజాస్వామికంగా పోరాటాలకు దిగుతామని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఏం ఎస్, పి మండల అధ్యక్షులు పేట సమ్మాలు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు లేగల రవి మాదిగ ప్రధాన కార్యదర్శి చిట్యాల రాకేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.