ఈనెల 23వ తేదీన మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఆఖరిపోరు
అదేరోజు విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు ప్రధానం

23వ తేదీన మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఆఖరి పోరు
అదే రోజు విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు ప్రదానం
ఉదయం 9 గంటల నుంచి ఫైనల్ మ్యాచ్
ఫైనల్ మ్యాచ్ కొరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి
22వ తేదీన సెమీ ఫైనల్స్-1లో నెల్లూరు వర్సెస్ కడప జట్ల మధ్య పోటీ
ఫైనల్స్-2లో గుంటూరు వర్సెస్ విజయనగరం మధ్య పోటీ
మంగళగిరి ప్రతినిధి జనవరి 21 యువతరం న్యూస్:
ఈ నెల 23వ తేదీన మంత్రి నారా లోకేశ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నవులూరు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆఖరి దశకు చేరాయి. 23వ తేదీన ఉదయం 9 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగును. అదే రోజు విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు ప్రదానం చేయనున్నారు. ఫైనాల్ మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. 22వ తేదీ బుధవారం నాడు ఉదయం నుంచి సెమీ ఫైనల్స్ జరుగును. సెమీ ఫైనల్స్ -1లో నెల్లూరు వర్సెస్ కడప జట్ల మధ్య పోటీ జరుగును. సెమీ ఫైనల్స్-2లో గుంటూరు వర్సెస్ విజయనగరం జట్ల మధ్య పోటీ జరుగును. ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 13 జట్లతో పాటు మంగళగిరి జట్టు కూడా పాల్గొంది. రోజుకు రెండు మ్యాచ్ లు జరుగుతుండగా, నాలుగు జట్లు తలపడుతున్నాయి. పోటీలు రసవత్తరంగా సాగుతుండడంతో, క్రీడాభిమానులు స్టేడియానికి పెద్ద ఎత్తున తరలొస్తున్నారు.
క్రీడా హబ్ గా మంగళగిరి నియోజకవర్గం
అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడలు ముఖ్యమని భావించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిని క్రీడా హబ్‌గా రూపొందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రతి ఏడాది ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో సొంత నిధులు వెచ్చించి కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటిన్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న విషయం విధితమే. మంగళగిరి నియోజకవర్గం నుంచి క్రీడాకారులను ప్రోత్సహించి, వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అన్ని రకాలా క్రీడాకారులకు మౌలిక సదుపాయలు అందబాటులోకి తీసుకొచ్చారు. తాడేపల్లి, మంగళగిరిలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. త్వరలో ప్రభుత్వం సహకారంతో మంగళగిరిలో అన్ని వసతులతో కూడిన అతి పెద్ద క్రీడా మైదానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
వివిధ క్రీడా పోటీల్లో ప్రతి క్రీడాకారుడికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు దుస్తులు మంత్రి నారా లోకేశ్ అందజేస్తున్నారు. దాతల సహకారంతో ఫ్రైజ్ మనీ, ట్రోఫీలు కూడా ఇస్తున్నారు. రాష్ట్ర, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహాయ సహకారాలు మంత్రి నారా లోకేష్ అందజేస్తున్నారు.