ANDHRA PRADESHOFFICIAL
వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి

వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి
కొత్తపల్లి జనవరి 18 యువతరం న్యూస్:
ప్రతి వాహనదారుడు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఎస్ఐ ఎం.కేశవ సూచించారు. అయన శుక్రవారం మండల పరిధిలోని నందికుంట గ్రామ శివారుల్లో వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు, బైకులు, ఇతర వాహనాలు కలిగిన ప్రతి వాహన దారుడు లైసెన్స్ తప్పకుండా పొంది ఉండాలన్నారు. ఆటోలలో ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకొని ప్రయాణం చేయరాదన్నారు. బైక్ పై వెల్లే వారు తప్పకుండా హెల్మేట్ ధరరించాలని, లైసెన్స్ కూడా కలిగి ఉండాలన్నారు. అనంతరం సరైన పత్రాలు లేని, నిబంధనలు పాటించని వారిపై జరిమాన విధించామన్నారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్లు మల్లికార్జున, అశ్వక్, తదితరులు ఉన్నారు.