కృష్ణా నదిలో మర బోట్లు తిప్పితే చర్యలు తప్పవు

కృష్ణా నదిలో మర బొట్లు తిప్పితే చర్యలు
కొత్తపల్లి జనవరి 18 యువతరం న్యూస్:
సింగోటం తిరుణాల సందర్భముగా తెలంగాణ సోమశిల నుండి ఆంధ్రప్రదేశ్ సిద్దేశ్వరం, సంగమేశ్వరం ఘాట్ లకు, ఆంధ్రప్రదేశ్ సిద్దేశ్వరం, సంగమేశ్వరం నుండి తెలంగాణ సోమశిల కు కృష్ణా నదిలో మరబోట్లు తిప్పితేచర్యలు తప్పవని ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కృష్ణానది పరివాహన ప్రాంతమైన సిద్ధేశ్వరం వద్ద ఉన్న మరబోట్ల ఘాటును తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రెవెన్యూ, పోలీసు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని కృష్ణా నదిలో ఎలాంటి మర బొట్లు తిరగరాదు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సింగోటం జాతరకు వెళ్లే ప్రయాణికులు బస్సులలో వెల్లేలా ప్రయాణికులకు అవగాహన కల్పించాలన్నారు. బోట్ల మీద ప్రయాణం ప్రమాదకరమని ఎవరు ప్రయాణం చేయరాదు అన్నారు. జిల్లా ఎస్సీ ఆదేశాలు వచ్చేదాకా బోట్ల నిర్వాహకులు కృష్ణా నదిలో బోటు తిప్పరాదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నదిలో మరబోట్లలో ప్రయాణికులను చేరవేస్తే చట్టపరమైన చర్యలతో పాటు అలాంటి వ్యక్తుల బోట్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. సిద్దేశ్వరం ఘాటు వద్ద విధులు నిర్వహిస్తున్న పలు శాఖల అధికారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సీఐ వెంట పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.