మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 23వ తేదీన లైవ్ మ్యూజిక్

మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని ఈ నెల 23వ తేదీన లైవ్ మ్యూజిక్
ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభంకానున్న లైవ్ మ్యూజిక్
మంగళగిరి ప్రతినిధి జనవరి 17 యువతరం న్యూస్:
ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరిలో పట్టణంలో ఈ నెల 23వ తేదీన లైవ్ మ్యూజిక్ కచేరీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మంగళగిరి పట్టణంలోని గౌతమ్ బుద్ధ రోడ్డులోని ఎన్నారై జంక్షన్ వద్ద బెల్జియన్ వాఫిల్ స్టోర్ ఎదురుగా మియామీ కేఫ్ పక్కన ఉన్న గ్రౌండ్ లో లైవ్ మ్యూజిక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సింగర్లు హాజరుకానున్నారు. ఈవెంట్ స్పాన్సర్లగా సేల్, సక్కు, మార్కోరోస్, ఉషోదయ సంస్థలు వ్యవహరిస్తున్నారు. మ్యూజికల్ లైవ్‌ను గోపి టీవి యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ప్రత్యక్ష ప్రచారం అందించనున్నారు. లైవ్ మ్యూజిక్ కచేరి కార్యక్రమానికి ఉచిత ప్రవేశమని, కావున అందరూ పాల్గొనాలని నిర్వాకులు కోరారు.