భోగి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు

భోగి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు
యాడికి జనవరి 14 యువతరం న్యూస్:
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుమారు 150 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అంతకుమునకు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అస్మిత్ రెడ్డి ముగ్గులు వేసిన ప్రాంగణాన్ని కలియతిరిగి మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం జరిగిన ముగ్గుల పోటీల్లో గెలిచిన మహిళలకు, సిఐ ఈరన్న స్థానిక టిడిపి నాయకులు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రిఫ్రిజిరేటర్ ను పోలా సరిత గెలుపొందారు. రెండవ బహుమతి వాషింగ్ మిషన్ ను దాసరి సరళ గెలుపొందారు. మూడవ బహుమతి ఎయిర్ కూలర్ ను శరణ్య గెలుపొందారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, పట్టణ అధ్యక్షులు వెలిగండ్ల ఆదినారాయణ, మాజీ ఎంపీటీసీ దడియాల ఆది, జనసేన కన్వీనర్ సునీల్, బిజెపి కన్వీనర్ గంగాధర్ గొర్తి లక్ష్మి, రాజశేఖర్ నాయుడు, యాడికి సర్పంచ్ పండు అనురాధ, నిట్టూరు సర్పంచ్ ఈశ్వరమ్మ, రాజారెడ్డి, చలమారెడ్డి, నరసింహ చౌదరి, బొట్టు శేఖర్, మధురాజు, తాండ్ర విక్రమ్, విశ్వనాథ, కోడూరు నీలకంఠేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వద్ది రాజా తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.