సంక్రాంతి సందర్భంగా గద్దె రాళ్లలో పరుగు పందెం పోటీలు

సంక్రాంతి సందర్భంగా గద్దెరాళ్లలో పరుగు పందెం పోటీలు…
దేవనకొండ జనవరి 15 యువతరం న్యూస్ :
దేవనకొండ మండలం గద్దెరాళ్ల గ్రామంలో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా యువకుల ఆధ్వర్యంలో ఆటల పోటీల నిర్వహించారు. పోటీల ఆర్గనైజర్స్ లు మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతుల కష్టానికి ఫలితం దక్కే పండుగ. ఇంటిల్లపాది కుటుంబ సభ్యులతో చిన్న పిల్లలతో సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అలాంటి పండుగ వాతావరణం లో పెద్దల ఆధ్వర్యంలో యువకులకు కర్నూలు రోడ్డు గద్దెరాళ్ల ద్వారకం నుండి ఉరివాకిలి కు పరుగుపందేలు నిర్వహించారు. ఈ పరుగు పందెంలో మొదటి బహుమతి మంగలి మహేష్ కు 1016 రూపాయలు, రెండవ బహుమతి అధిష్ 516 రూపాయలు అందించారు. అనంతరం పూలమాలల తో గ్రామ పురవీధుల గుండా పరుగు పందెంలో నిలిచిన విజేతలను ఊరేగించారు. ఆర్గనైజర్స్ గా తలారి చిన్న నెట్టేకల్, వీర కృష్ణయాదవ్, అశోక్ నాయుడు, టైలర్ ఆనంద్, మంగలి అనిల్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.