ANDHRA PRADESHSPORTS NEWSSTATE NEWS

మంగళగిరిలో హోరాహోరీగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు

మంగళగిరిలో హోరాహోరీగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

పెద్ద ఎత్తున పోటీలను తిలకిస్తున్న క్రీడాభిమానులు, ప్రజలు

మంగళగిరి ప్రతినిధి జనవరి 14 యువతరం న్యూస్:

మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు విజయనగరం వర్సెస్ కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయనగరం జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి శ్రీకాకుళం జట్టు ఫిల్డింగ్ తీసుకోగా బ్యాటింగుకు దిగిన కర్నూలు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 115 పరుగులు చేసింది. 116 పరుగుల విజయ లక్ష్యంతో బారిలో దిగిన విజయనగరం జట్టు 3 వికెట్ల నష్టంతో 11.04 ఓవర్లలోనే కర్నూలు జట్టుపై ఘన విజయం సాధించింది. అనంతపురం శ్రీకాకుళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అనంతపురం జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 120 పరుగులు చేసింది. 121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జట్టు అనంతపురంపై 3 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రెండు మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారులకు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ళ చిరంజీవి సహకారంతో రెండు మ్యాచ్‌లకు రూ 10 వేలు చొప్పున నగదు బహుమతి అందజేశారు. ఈవెంట్ స్పాన్సర్లగా సేల్, సక్కు, మార్కోరోస్, ఉషోదయ, వి డిజిటల్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపి టీవి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రచారం అందించడం జరుగుతుంది. ప్రీమియర్ లీగ్, సిజన్-3 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ 3 లక్షలు కొమ్మారెడ్డి కిరణ్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు కాట్రగడ్డ మధు సుధన్ రావు, తృతీయ బహుమతి కింద రూ. లక్ష నగదును పల్నాటి నాగేశ్వరరావు, అమ్మిరెడ్డి సాంబశివరావు సహకారంతో బహుమతులు ప్రధానం చేయనున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ. 50 వేలు బత్తుల హరిదాస్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కు రూ 25 వేలు కాసరనేని జస్వంత్, బెస్ట్ బౌలర్ కు రూ 25 వేలు తాడిపత్రి అజయ్ కుమార్, ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.10 వేల నగదును భోగి వినోద్, కనికళ్ళ చిరంజీవి సహకారంతో నగదు బహుమతులు అందించనున్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!