కరెంటు చార్జిలా బాదుడిపై వైయస్సార్సీపీ పోరుబాట

కరెంటు చార్జీల బాదుడుపై
వైఎస్ఆర్సీపీ పోరుబాట
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 25 యువతరం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ తల పెట్టిన పోరాట కార్యక్రమం విజయవంతం చేయాలి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసిన ఉత్తరాంధ్ర రీజినల్ కో- ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి.
ఈ కార్యక్రమానికి హాజరైన అరకు అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు రేగం మత్స్యలింగం.ఇందులో భాగంగా చర్చిన అంశాలుఈ నెల 27 తేదిన శుక్రవారం నాడు తల పెట్టిన విద్యుత్ చార్జీలు పెంపు దల పై పోరాటం నకు సిద్ద పడుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సమాయత్తం కావాల్సి ఉందని సుధీర్ఘంగా చర్చించి, పోస్టర్ విడుదల చేశారు.జరగబోయే కార్యక్రమంలో భాగంగా గృహ వినియోగదారులకు మోపిన రూ. 15,485.36 కోట్లు చార్జీలు బాధుడును వెనక్కి తీసుకోవాలని అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చార్జీల పెంపును నిలిపేయాలని మరియు ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి డిమాండ్ చెయ్యనున్నారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ఛైర్పర్సన్ జలిపల్లి సుభద్ర , ఎమ్మెల్సీ కుంభ రవిబాబు , విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ , అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు , మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.