ఈనెల చివరి వరకు పంటల బీమా పొడిగింపు

ఈనెల చివరి వరకు పంటల బీమా పొడిగింపు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి డిసెంబర్ 24 యువతరం న్యూస్:
మండలంలోని ముసలిమడుగు మరియు శివపురం గ్రామం నందు పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో రబీ సీజన్ నందు పంట వేసిన ప్రతి రైతు స్థానిక రైతు సేవ కేంద్రం నందు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది.
పంటల ప్రీమియం కట్టుటకు ఈనెల 31 వరకు సమయం ఉన్నది కాబట్టి రబీ సీజన్ నందు మినుము, సెనగ, ఉల్లి, జొన్న పంటలు సాగు చేసిన రైతులు ప్రీమియం కట్టి పంటల బీమా చేయించుకోవాలని రైతులకు సూచించారు.
కంది పంటలో ఎండు తెగులు నివారణకు కాపరాక్స్ క్లోరైడ్ మందులు మొక్క మొదలు తడిచే లాగున పిచికారి చేసుకుని నివారించుకోవచ్చు అని సూచించడం జరిగింది.
మినుములో రసం పిలిచి పురుగుల నివారణకు ఇమిదక్లోప్రిడ్ లేదా తయోమితాగ్జామ్ లేదా అసిటామా ఫ్రైడ్ లేదా మెటాసి స్టాక్ మందులను మార్చి మార్చి ఏదో ఒకదానిని పిచికారి చేసుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే రసం పీల్చే పురుగుల ఉధృతిని నివారించడానికి పసుపుపల్లె ఎర లను ఎకరాకు 25 నుంచి 30 30 వరకు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలోరైతు సేవ కేంద్ర సిబ్బంది రవీంద్ర నాయక్ మరియు మౌనిక పాల్గొన్నారు.