ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యం

ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తథ్యం..
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు
గుంటూరు ప్రతినిధి డిసెంబర్ 23 యువతరం న్యూస్:
ఉమ్మడి కృష్ణ- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం తధ్యమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు ఏటుకూరు రోడ్డు లోని వివాహ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన కృష్ణ- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విపు జీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నక్క ఆనంద్ బాబు , ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.