BREAKING NEWSEDUCATIONTELANGANA
విద్యార్థులను ఉపాధ్యాయుడు కొడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పిల్లల్ని టీచర్ కొడుతున్నాడని పిల్లల తల్లిదండ్రుల ఆందోళన.
అశ్వరావుపేట ప్రతినిధి డిసెంబర్ 23 యువతరం న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఒక టీచర్ తరచుగా పిల్లలను కొడుతున్నాడని పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి క్లాస్ రూమ్ లోకి తాళాలు వేసి ఆందోళన చేస్తున్నారు,గత రెండు రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్నా ఒక బాబును కొట్టగా చెవులో నుంచి నెత్తురు కారి తీవ్ర ఇబ్బంది పడ్డాడని,వారం రోజుల క్రితం ఒక బాబుని కొట్టగా చెంపలు వాసినాయని,గత ఆరు నెలల నుంచి ఈ పాఠశాలలో ఇదే సంఘటనలు జరుగుతున్నాయని,ఎవరైతే పిల్లల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నరో ఆ టీచర్ ని విధుల నుంచి తొలగించాలని ఆందోళన చేపట్టారు.