సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణి చేసిన సీఎం చంద్రబాబు.
అనంతపురం ప్రతినిధి నవంబర్ 30 యువతరం న్యూస్:
ఎన్ టి ఆర్ భరోసా పింఛన్ల పంపిణి కోసం శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు విచ్చేశారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో ఆయన లబ్ధిదారుల ఇళ్ళకే వెళ్లి ఆప్యాయంగా పలుకరించి పెన్షన్ లను స్వయంగా అందజేసారు.
నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ ను స్వయంగా అందజేసారు. అదేవిదంగా మరో లబ్ధిదారురాలు బోయ బాగ్యమ్మ ఇంటికెళ్లి రు. 15వేల వికలాంగ పింఛన్ అందజేశారు.ఆమె ఇంటిలో టీ తాగారు. తదుపరి ఇందిరమ్మ కాలనీ ప్రజలతో ముచ్చటించి వారితో ఫోటో దిగారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్,రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.