
బాలికలు ఋతుక్రమ పరిశుభ్రత పై అవగాహన పెంచుకోవాలి
డాక్టర్ అనూష
మంగళగిరి ప్రతినిధి నవంబర్ 28 యువతరం న్యూస్:
మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటీఎంసీహైస్కూల్లో స్థానిక గణపతి నగర్లోని ఇందిరా నగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో గురువారం బాలిక రక్ష కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలకు ఋతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష బాలికలకు ఋతు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. డాక్టర్ అనూష బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ పీరియడ్స్ సమయంలో అపరిశుభ్రమైన పద్ధతులు పునరుత్పత్తి మార్గంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయన్నారు. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. ఋతుక్రమ ఉత్పత్తులను ఉపయోగించే ముందు తర్వాత చేతులు శుభ్రపరచుకోవాలన్నారు. ఋతుక్రమంలో ఉపయోగించిన ఉత్పత్తులను పేపర్లో చుట్టి బయట ఎల్లో డస్ట్ బిన్ లో వేయాలన్నారు. క్రమ పద్ధతిలేని పిరియడ్స్ వస్తున్నప్పుడు, ఎనిమిది రోజులకు మంచి బ్లీడింగ్ అయిన సమీపంలోని హెల్త్ సెంటర్లో ప్రభుత్వ అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనూష అన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ రాజేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.