ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాల ఐదు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాల ఐదు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి
ఏఐటీయూసీ డిమాండ్
కొలిమిగుండ్ల నవంబర్ 29 యువతరం న్యూస్:
ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కూల్ ఆయాల ఐదు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని
కొలిమిగుండ్ల ఎంఈఓ ఆఫీసులో సమస్యలతో కూడిన వినతిపత్రం శుక్రవారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూలు ఆయాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి శివ బాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆయాలకు గత ఐదు నెలల నుండి జీతాలు పెండింగ్లో ఉండటం వలన చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు, దీనివలన
కొన్నిచోట్ల మానివేసే పరిస్థితి ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఐదు నెలల పెండింగ్ జీతాలు వెంటనే వారి అకౌంట్లో వేయాలి. ఆయాలు జీతాలు ప్రతినెల జీతాలు పెండింగ్లో లేకుండా వెయ్యాలి.
ఆయాలకు అత్యవసర పరిస్తితులలో నెలకు ఒక రోజు సెలవు ఇవ్వాలి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వందమంది దాటిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఆయాలను అదనంగా నియమించాలి. వీరికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి,. అని
కార్మికుల సమస్యల గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు చంటి ,కంబగిరి స్వామి ,ఉపాధ్యక్షులు నాగరాజు, సురేష్ ,కంబయ్య తదితరులు పాల్గొన్నారు.