
ఆదివాసి గ్రామాలలో ఐటీడీఏ పీవో పర్యటించాలి
ఆదివాసి సమస్యలను పరిష్కరించాలి
జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి
ములుగు ప్రతినిధి నవంబర్ 26 0 యువతరం న్యూస్:
సోమవారం వెంకటాపురం ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ ఆవరణంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కమిటీ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ అధ్యక్షతన జరిగింది,సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సాయి హాజరై మాట్లాడుతూ,ఆదివాసి గ్రామాలను గాలికి వదిలేశారని,ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది అన్నారు, ఎటునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గ్రామాల్లో పర్యటించి,ఆదివాసి భూ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసుల భూములను వలస గిరిజనేతలు దౌర్జన్యంగా ఆక్రమించు కుంటున్నారని ఆయన ఆరోపించారు,గ్రామాల్లో కనీసం చిన్న పిల్లలకు విద్య బోధన నేర్చుకునే అంగన్వాడీ భవనాలు కూడా లేవని,ఆదివాసీ బిడ్డలను విద్యకు దూరం చేస్తూ మళ్ళీ అంధకారంలో నెట్టేస్తున్నారని ఆయన అన్నారు,ఇది కేవలం ప్రాజెక్ట్ అధికారి ఆదివాసీ గ్రామాలను పర్యటించి సమస్యలను తెలుసుకోకోపోవడం వల్లే అని ఆయన ఆరోపించారు, ఐదు షెడ్యూల్ ప్రాంతంలో జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసీలు ఉద్యమించాలని లేదంటే గిరిజనేతరులు ఆదివాసి చట్టాలను పాతర పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు,ఆదివాసీల భూ సమస్యలపై ఎటునాగారం ఐటిడిఏ స్పందించి ఆదివాసీ సమస్యల పై శ్రద్ధ చూపాలని అన్నారు,లేని పక్షంలో ఆదివాసీ సమస్యల పై ఉద్యమిస్తామని హెచ్చరించారు,కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసెంట్ పూనెం ప్రతాప్ నాయకులు పాల్గొన్నారు.