ANDHRA PRADESHCRIME NEWSOFFICIALSTATE NEWS
అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్బ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
అనంతపురం ప్రతినిధి నవంబర్ 24 యువత న్యూస్:
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం.ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.