ANDHRA PRADESHDEVOTIONALWORLD
సంగమేశ్వరంలో కార్తీక మాస పూజలు ప్రారంభం

సంగమేశ్వరంలో కార్తీక మాస పూజలు ప్రారంభం
కొత్తపల్లి నవంబర్ 3 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరంలో పెరిగిన భక్తుల సందడితో కార్తీక శోభ నెలకొంది శనివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సప్తనదుల్లో స్థానాలు ఆచరించి ఎగువ పుష్కరఘాట్ వద్ద ఉన్న ఉమా మహేశ్వరాలయంలో లలితా దేవి అమ్మవారి ముందు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి,భక్తితో దీపాలు వెలిగించి కార్తీకమాస పూజలను మొక్కులు తీర్చుకున్నారు.