మెట్ట భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీరు ఇవ్వాలి

మెట్ట భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీళ్ళు ఇవ్వాలి
శివపురం, గోకవరం వద్ద వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి
కొత్తపల్లి అక్టోబర్ 30 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలంలోని మెట్ట భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ల ద్వారా సాగునీళ్ళు ఇవ్వాలని చెరువులను నింపాలని సింగరాజుపల్లి గంగ రేపు వాగు చెరువుకు సాగునీటి సంఘం ఎన్నికల నిర్వహించాలని శివపురం గోకవరం గ్రామాల వద్ద ఉన్న వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ ఎన్ స్వాములు డిమాండ్ చేశారు మంగళవారం నాడు కొత్తపల్లి మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి మండలం లో చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం వర్షాధారంపైనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు కృష్ణానది నీళ్లు పక్కనే ఉన్న మెట్ట భూములకు సాగు నీళ్లు అందడం లేదు పాలకుల నిర్లక్ష్యానికి,ప్రకృతి నిరాదరణకుగురవుతున్న కొత్తపల్లి మండలంలో రైతులు ప్రతి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు శివపురం లింగాపురంగ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగు ,గోకవరం ఎదురుపాడు గ్రామాల మధ్య ఉన్న నల్ల వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలు ఉండడంవల్ల కొద్దిపాటి వర్షానికి వాగులు ఉదృతంగా ప్రవహిస్తూ 12 గ్రామాలు చెంచుగూడాలకు రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ఆ సందర్భంలో అనారోగ్యాల పాలైతే ఆసుపత్రికి వెళ్లే దిక్కు లేదు అధికారులు గ్రామాలకు వచ్చేపరిస్థితి ఉండదు గతంలో ఈ వాగులో పశువులు మనుషులు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి సింగరాజు పల్లె గంగ రేపు వాగు చెరువు నిర్మాణం పూర్తయి 15 సంవత్సరాలు అవుతున్న చెరువు కింద నేటికి పంట కాలువలు లేవు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువు తూములు మరమ్మత్తులకు గురయ్యాయి ఇప్పటికైనా ప్రభుత్వం నాగంపల్లి దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి నందికుంట దుద్యాల బావాపురం కొత్తపల్లి లింగాపురం గ్రామాలమెట్ట భూములకు సాగునీరు ఇవ్వాలని జడ్డువారిపల్లె వద్ద మరో లిప్టన్ ఏర్పాటు చేసి జడ్డువారిపల్లె ఎదురుపాడు కొక్కెరంచ గ్రామాల్లో మెట్ట భూములకు సాగునీరు ఇవ్వాలని శివపురం సంగమేశ్వరం లిఫ్టుల ద్వారా మండలంలోని చెరువులను నింపాలని శివపురం సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లను ఫార్మర్స్ కమిటీల మేనేజ్మెంట్ నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కిందికి తీసుకురావాలని శివపురంలో దళితుల భూములకు కొత్త డీసీలను ఏర్పాటు చేసి శివపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం నీళ్లు ఇవ్వాలని సింగరాజు పల్లి గంగరేగు వాగు చెరువుకు ఎన్నికలు నిర్వహించి సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెరువుకు మరమ్మత్తులు చేపట్టిపంట కాలువలు ఏర్పాటు చేయాలని శివపురం గోకారం గ్రామాల దగ్గర ఉన్న వాగులపై హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కే రాజేష్ నాయకులు పి నాగేష్ ఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడు లు బొల్లు ప్రసాద్ బాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.