ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచండి

ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచండి
గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 2.19 కోట్ల రూపాయల జమ
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల కలెక్టరేట్ అక్టోబర్ 18 యువతరం న్యూస్:
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పెంచి వేగాన్ని పెంచి నిర్దేశించిన లక్ష్యాల్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంపీడీఓలు, మండల ఇంజనీర్లను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో డ్వామా పిడి జనార్దన్ రావు, హౌసింగ్ ఈఈ హరిహర గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఎంపీడీఓలు, మండల ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో తిరిగి లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల ఇబ్బంది తెలుసుకొని ఇసుక, సిమెంటు ఇతర మెటీరియలలో సరఫరా లో ఉన్న ఇబ్బందులను తొలగించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి కూడా అధ్వాన రీతిలో ఉందని పనితీరు మెరుగుపరచుకొని పురోగతి సాధించాలన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాలలోని 850 గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 1.94 కోట్ల రూపాయలు తమ ఖాతాల్లో జమ అయిందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న 80 మంది లబ్ధిదారులకు 25 లక్షల రూపాయలు జమ అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటే సంబంధిత మొత్తాలు లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయన్న విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వచ్చే వారానికి మంచి పురోగతి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.