BREAKING NEWSCRIME NEWSOFFICIALSTATE NEWSTELANGANA
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య
హైదరాబాద్ బ్యూరో అక్టోబర్ 17 యువతరం న్యూస్:
పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పైలట్ గా హోం గార్డు రమణ (హెచ్ జి 3544) విధులు నిర్వహిస్తున్నారు.ఆర్ధిక ఇబ్బందులతో హోం గార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.అంబర్ పేట్ చిలుకా నగర్ లో నివాసం ఉండే హోం గార్డు రమణ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడినట్లు సమాచారం. మృతుడు హోంగార్డు రమణకు భార్యతో పాటు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు హోంగార్డు రమణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా.