ఆస్ట్రేలియా తెలుగు ప్రజల ఆతిథ్యం మరువలేనిది

ఆస్ట్రేలియా తెలుగు ప్రజల ఆథిత్యం మరువలేనిది.
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల ప్రతినిధి అక్టోబర్ 19 యువతరం న్యూస్:
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో శుక్రవారం తెలుగు ప్రజల ఆథిత్యం మరువలేనిదని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు లగడపాటి సుబ్బారావు, గోపి నంబాల, కొణిదెన శ్రీకాంత్ తాతిన సుమ , దాసరి సుమన్, సూరపనేని ప్రకాష్ , జొన్నలగడ్డ నర్మద, విషర్ల నితిన్ తదితరులు తనను, తన భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి లకు అతిథిత్యం ఇచ్చి గౌరవించడం గొప్ప అనుభూతిగా నిలుస్తుందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం విజయానికి తమ వంతు పాత్ర పోషించిన ఆస్ట్రేలియా తెలుగు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు శబరి తెలిపారు. మీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందని, ఎంపీగా నా బాధ్యత కూడా ఉంటుందని ప్రజల కష్టాలు తొలగించేందుకు పనిచేస్తామని చెప్పారు.