మంగళగిరిని క్రీడా హబ్ గా మార్చడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యం

మంగళగిరిని క్రీడా హబ్‌గా మార్చడమే మంత్రి నారా లోకేష్ లక్ష్యం
మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో ఈ నెల 9 నుంచి 12 వరకు పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు
విజేతలకు రూ. లక్ష, రూ.75 వేలు, 50 వేలు నగదు బహుమతులు ప్రధానం
పురుషులు, మహిళలకు వేరు వేరుగా బహుమతులు ప్రధానం
టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో పోస్టర్ ఆవిష్కరించిన టీడీపీ నేతలు
ప్రతి యేటా వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్
మంగళగిరి ప్రతినిధి అక్టోబర్ 05 యువతరం న్యూస్:
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణం గౌతమి బుద్ధ రోడ్డులోని బిఎమ్‌డబ్ల్యూ కార్ల షోరూమ్ పక్కన గ్రౌండ్లో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య తెలిపారు. టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను నియోజకవర్గ తెలుగుయువత ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం టీడీపీ కార్యాలయం, ఎమ్మెస్సెస్ భవన్లో టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గాన్ని క్రీడా హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో ప్రతి యేటా వివిధ రకాల టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులోకి రావడానికి ఇలాంటి లీగ్‌లు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. పురుషులు, మహిళలకు వేరువేరుగా బహుమతులు ఉంటాయన్నారు. ప్రథమ బహుమతి రూ. లక్ష, ద్వితీయ బహుమతి రూ. 75 వేలు, తృతీయ బహుమతి రూ. 50 వేల నగదు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాయపూడి కిరణ్, నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొప్పుల మధు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్ధుల్ మజీద్, పార్లమెంట్ బీసీ సెల్ నాయకులు వాకా మంగరావు, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్, మంగళగిరి రూరల్ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ నజీర్, షేక్ హూస్సెన్ తదితరులు పాల్గొన్నారు.