సాహితీ శిఖరం కన్నెబోయిన

సాహితీశిఖరం కన్నేబోయిన
సాహితీ వేత్త డాక్టర్ నల్లా నరసింహమూర్తి
అమలాపురం ప్రతినిధి సెప్టెంబర్ 29 యువతరం న్యూస్:
నాలుగు దశాబ్దాలుపాటు తెలుగు సాహితీరంగంలో తనదైన ముద్ర తో ప్రాచీన ఆధునిక సాహిత్యం లో వేలాది ఉపన్యాసాలు ఇస్తూ ఆధ్యాత్మిక రంగంలో తనదైన ప్రతిభ ను చూపించిన సాహితీ శిఖరం కన్నెబోయిన వెంకటేశ్వరరావు అని
ప్రముఖ సాహితీవేత్త ,సీనియర్ తెలుగు లెక్చరర్ , ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు అధ్యాపక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లా నరసింహమూర్తి అన్నారు. శనివారం ఉదయం ఉప్పలగుప్తం మండలం బట్టుపాలెం ఏ.వీ.ఎస్.ఎన్. జూనియర్ కళాశాల మరియు అమృత ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీ శ్రీ కళావేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,
కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలోజరిగిన కన్నెబోయిన వెంకటేశ్వరరావు ఐదవ వర్ధంతి సభలో ఆయన ప్రసంగించారు. అమలాపురం ఎస్. కె. బి. ఆర్ కళాశాలలో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు అధ్యాపకునిగా ఎందరో విద్యార్థులను ఉన్నత గా తీర్చిదిద్దారని వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి తెలుగులో ఉచిత కోచింగ్ నిర్వహించారని ఆయన అన్నారు. సభకు కోనసీమ రచయితల సంఘం అధ్యక్షులు బి.వి.వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కన్నబోయిన రచించిన శాంతిక పోతాలు కవితాసంపటిపై ప్రముఖ కవి మాకే బాలార్జున సత్యనారాయణ ప్రసంగించారు.
సభకు ముందు కన్నెబోయిన చిత్రపటానికి విద్యార్థుల సమక్షంలో డాక్టర్ నల్లా నరసింహమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో సేవా కార్యక్రమంగా విద్యార్థులు నోటు పుస్తకాలు నిమ్మకాయల వెంకట సుబ్బా రావు పంపిణీ చేశారు.
ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, విశ్రాంత భవిష్యనిది అసిస్టెంట్ కమిషనర్ న్యాయవాది అద్దంకి అమరేశ్వరరావు, కడలి సత్యనారాయణ పసలపూడి సతీష్ పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి పాల్గొన్నారు.