ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భధ్రత
ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన
జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐపియస్
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
కర్నూల్ ప్రతినిధి సెప్టెంబర్ 29 యువతరం న్యూస్:
2024 అక్టోబర్ 1 న ( మంగళవారం) కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం, పుచ్చకాయలమడ గ్రామంలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదివారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.
పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్ల పై సంబంధిత అధికారులకు తగిన సూచనలు సలహాలు చేశారు.
ప్రోటో కాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
విధులు నిర్వహించే పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు పోలీసు జాగీలాలు బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ వెంట ఎయిర్ పోర్టు ఇంటెలిజెన్స్ అధికారులు కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి కర్నూలు ఇంచార్జ్ డిఎస్పీ శ్రీనివాసాచారి ఓర్వకల్లు ఎమ్మార్వో విద్యాసాగార్ సిఐలు ప్రసాద్ కేశవ రెడ్డి పవన్ కిశోర్ చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు ఎస్సై సునీల్ పాల్గొన్నారు.