కోట్ల,ధర్మవరం సుబ్బారెడ్డి ఒకటే

కోట్ల ధర్మవరం సుబ్బారెడ్డి ఒకటే
తెలుగుదేశం పార్టీ కోసం కృషిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ని గుర్తుపెట్టుకుంటా
రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నియమించిన ఈ పదవీని భాధ్యతగా తీసుకొని పని చేస్తా
పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కష్ణపడిన నాయకులకు, కార్యకర్తలకు కష్టం వస్తే అండగా నిలుస్తా
ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
డోన్ ప్రతినిధి సెప్టెంబర్ 27 యువతరం న్యూస్:
ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్” గా నియమితులై డోన్ కు శుక్రవారం మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా డోన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. నందమూరి తారక రామారావు విగ్రహము పూలమాలలు వేసి అక్కడి నుండి భారీ బైకు ర్యాలీతో పాత బస్టాండ్ లో ఆయన మాట్లాడుతూ……. గత 2021 న నాకు డోన్ నియోజవర్గం ఇన్చార్జిగా నియమించిన అప్పటినుంచి నా వెంట నడుస్తున్న ప్రతి కార్యకర్త కు పేరుపేరునా ధన్యవాదములు అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం అయితే నేమి ఇదేం కర్మ ప్రోగ్రామ్ అయితేనేమి నా వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా ఆదుకుంటా ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని మనస్పూర్తిగా హామీ ఇస్తున్న.అదేవిధంగా డోన్ నియోజకవర్గం సంబంధంలేని నాయకులు పార్టీ సభ్యత్వం లేని నాయకులు నెల ముందు పార్టీలో చేరిన నాయకులు పెత్తనాలు ఎలా ఇస్తున్నారు ఇకమీదట అది జరగదు ఖబర్దార్ అంటూ అదేవిధంగా మూడేళ్ల నుంచి పార్టీ జెండా మోస్తూ గత 40 సంవత్సరాలు పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి ఎవరో పెత్తనం చెలాగిస్తే ఊరుకుండేది లేదు. రేపటి నుంచి ఇవన్నీ జరగవు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి నందమూరి తారక రామారావు విగ్రహమునకు, పొట్టి శ్రీరాములు విగ్రహమునకు, కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహమునకు,శ్రీ కృష్ణదేవరాయల విగ్రహమునకు, కె.యి.మాదన్న విగ్రహమునకు, వాల్మీకి మహర్షి విగ్రహమునకు, గాంధీ విగ్రహమునకు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహమునకు పూలమాలతో నివాళులు అర్పించారు అనంతరం ఇంటికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, ధర్మవరం మన్నే చిన్న నాగిరెడ్డి గారు, రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున. యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి, డోన్ పట్టణ టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్ ఆలా మల్లిఖార్జున రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అడ్వసర్ మధుసుదన్ గౌడ్, యువ నాయకులు ధర్మవరం మన్నే భరత్ రెడ్డి, బేతంచేర్ల పట్టణ టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్ ఉన్నాం చంద్రశేఖర్, బేతంచేర్ల పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్షావళి చౌదరి , సర్పంచ్ రామిరెడ్డి, జిల్లా బిసి కమిటీ నాయకులు జయ్యన్న, డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు, బుగ్గనపల్లె రమేష్, బేతంచేర్ల కౌన్సులర్ లు, డోన్ పట్టణ టిడిపి బిసి సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్, నంద్యాల జిల్లా తెలుగుయువత నాయకులు బోరెడ్డి అభిలాష్ రెడ్డి, డోన్ పట్టణ టిడిపి తెలుగుయువత ప్రధాన కార్యదర్శి సిటి కేబుల్ కిరణ్,కాంత్ బ్రదర్స్ , డోన్ మండలం తెలుగుయువత అధ్యక్షులు కోనేటి కాశీ విశ్వనాథ్, మరియు ఓటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున
పాల్గొన్నారు.