వర్షాల వల్ల దెబ్బతిన్న గృహాలు, పశుసంపదకు నష్టపరిహారం 37.02 లక్షలు

వర్షాల వల్ల దెబ్బతిన్న గృహాలు, పశు సంపదకు నష్ట పరిహారం 37.02 లక్షలు
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల కలెక్టరేట్ సెప్టెంబర్ 27 యువతరం న్యూస్:
గత ఆగస్టు 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నంద్యాల జిల్లాలోని 23 మండలాలకు సంబందించి 92 గ్రామాలలో 332 ఇండ్లు దెబ్బతినడం, 45 మేకలు, ఒక ఎద్దు మృత్యువాత పడటం, ఒక పశు పాక దెబ్బతిన్నందున భాదితులకు నష్టపరిహార మంజూరు నిమిత్తం ప్రభుత్వం రు. 37,02,500/- లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దెబ్బతిన్న ఇంటికి రు. 10,000/- ప్రకారము 332 మంది భాదితులకు, మేక ఒక్కింటికి రూపాయలు 7,500/- ప్రకారము 45 మేకల భాదితులకు మరియు దెబ్బతిన్న పశు పాకకు రూపాయలు 5,000/- ప్రకారము మొత్తము నష్టపరిహారము రూపాయలు 37,02,500/- ప్రభుత్వం మంజూరు చేసి నేరుగా భాదితుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.