విద్యార్థిని ప్రతిభ,జిల్లా కలెక్టర్ చిత్రపటాన్ని పెన్సిల్ తో గీసిన 10వ తరగతి విద్యార్థిని

జిల్లా కలెక్టర్ చిత్రపటాన్ని పెన్సిల్ తో గీసిన 10వ తరగతి విద్యార్థిని
జిల్లా కలెక్టర్ కి చిత్రపటాన్ని అందించిన నవ్యశ్రీ..
బాలికను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.
అనంతపురం, సెప్టెంబర్ 30 యువతరం న్యూస్ ప్రతినిధి
రాయదుర్గం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి.నవ్యశ్రీ అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చిత్రపటాన్ని పెన్సిల్ తో గీసింది. చిత్రపటాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు అందజేసింది. తన చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోయిన జిల్లా కలెక్టర్ బాలికను అభినందించారు.భాగా చదువుకోవాలని 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ కావాలని జిల్లా కలెక్టర్ విద్యార్థినికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థిని నవ్యశ్రీ మాట్లాడుతూ తాను పెన్సిల్ తో బొమ్మలు గీయడం నేర్చుకుంటున్నానని, తొలుత జిల్లా కలెక్టర్ చిత్రపటాన్ని గీయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, రాయదుర్గం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం జయప్రద, టీచర్ , బాలిక తండ్రి నరసింహులు, తల్లి వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.