ముఖ్యమంత్రి పర్యటన భద్రత ఏర్పాలను పర్యవేక్షించిన కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్

ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్
రాష్ట్రముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన… జిల్లా ఎస్పీ.
కర్నూలు ప్రతినిధి అక్టోబర్ 1 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం , పుచ్చకాయల మాడ గ్రామంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణి చేసే కార్యక్రమం సంధర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కర్నూలు జిల్లా కు విచ్చేశారు.
ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ని కర్నూల్ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
ముఖ్యమంత్రి పర్యటన ను కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా , జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ లు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ఇతర అన్ని శాఖల అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, డిఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, సిఐలు ఉన్నారు.