HEALTH NEWSOFFICIALTELANGANA
వాజేడు ప్రాథమిక కేంద్రంలో ఆశా కార్యకర్తలు సమావేశం

వాజేడు ప్రాథమిక కేంద్రంలో ఆశ కార్యకర్తలు సమావేశం
ములుగు ప్రతినిధి అక్టోబర్ 1 యువతరం న్యూస్:
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు, సమావేశంలో వైద్యాధికారి మధుకర్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తల కార్యక్రమాన్ని రివ్యూ చేయడం జరిగిందని గ్రామాలలో ఇంటింటి సర్వే వ్యాధుల పట్ల గ్రామస్తుల అవగాహన కలిగించడం అందరూ తప్పనిసరిగా దోమతెరలు వాడాలని గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని చంటి పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు, ఈ కార్యక్రమంలోవైద్యాధికారి మధుకర్, పల్లె దావకాన డాక్టర్ జ్ఞానస, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ శేఖర్, చిన్న వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం సత్యవేణి, ఛాయాదేవి, లలిత కుమారి, కన్యాకుమారి, రాజేశ్వరి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.