ANDHRA PRADESHEDUCATIONOFFICIAL

ఈవ్ టీజింగ్, యాంటీ ర్యాగింగ్ ,మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి

కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకునే విధంగా, బాధ్యతయుతమైన పౌరులుగా విద్యార్ధులను తీర్చిదిద్దాలి.

జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్

కర్నూలు ప్రతినిధి సెప్టెంబర్ 25 యువతరం న్యూస్:

• కర్నూలులోనికళాశాలల యాజమాన్యాలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, HODలతో కలిసి సమావేశం నిర్వహించిన … జిల్లా ఎస్పీ.

• సైబర్ నేరాలు , రోడ్డు భద్రత నిబంధనల పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

• ఈవ్‌ టీజింగ్‌, యాంటీ ర్యాగింగ్‌, మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాల గురించి యాజమాన్యాలు విద్యార్ధులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి.

బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కర్నూలులోని ఆయా ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, కళాశాలల ప్రిన్సిపాల్స్, HODలు, అధ్యాపకులతో కలిసి జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్  సమావేశం నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు చేశారు.

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్  మాట్లాడుతూ…

యాంటీ ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌, మాదకద్రవ్యాల వలన కలిగే నష్టాల పై , సోషల్‌ మీడియా, రోడ్డు భద్రత, సైబర్‌ నేరాల పట్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

విద్యార్దుల్లో క్రమశిక్షణ పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు.

బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు.

ఈవ్‌ టీజింగ్‌, ర్యాగింగ్‌ అనేవి నేరమని, ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలుంటాయని భవిష్యత్తు కోల్పోతారని తెలియజేయాలన్నారు.

సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కొవాలే తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదని తెలియజేయాలన్నారు.

మాదకద్రవ్యాల బారినపడి విద్యార్దులు జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్దులకు తెలియజేయాలన్నారు.

మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా క్రయ, విక్రయాలు జరిపినా లేదా సేవించినా డయల్‌ 100 కు కాల్‌ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

అతిగా సెల్ ఫోన్ వినియోగం , సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ఇంస్టాగ్రామ్‌ లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

సోషల్‌ మీడియా వేధింపుల పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనవసర లింకులు షేర్‌ చేయకూడదని, తెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, లోన్‌ యాప్ లు , ఇన్వెస్ట్మెంట్లు, apk ఫైల్స్ , బెట్టింగ్‌ యాప్స్‌ లాంటి వాటితో మోసపోకూడదని విద్యార్దులకు తెలియజేయాలన్నారు.

సైబర్‌ నేరాలకు గురి అయితే వెంటనే 1930 కి సమాచారం అందించి, సైబర్ క్రైమ్ పోర్టల్ లో www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని విద్యార్దులకు అవగాహన కల్పించాలన్నారు.

సైబర్‌ నేరాలను అదుపు చేయాలంటే ఒక్క పోలీసు వ్యవస్థతోనే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కర్నూలులోని ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, HODలు, అధ్యాపకులు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఖాజావళి పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!