ANDHRA PRADESHDEVOTIONALWORLD
సంగమేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన కృష్ణా జలాలు

సంగమేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన కృష్ణాజలాలు
కొత్తపల్లి సెప్టెంబర్ 24 యువతర న్యూస్:
మండలంలోని సప్తనది సంగమేశ్వరం వద్ద శ్రీశైలం ప్రాజెక్టు వెనుకజలాలు అయిన కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టాయి. మల్యాల ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు హెడ్ ఎగ్యూలేటర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. దీంతో సోమవారం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుంచి 875 అడుగులకు చేరుకుంది. దీంతో సంగమేశ్వరం వద్ద ఎగువ పుష్కరఘాట్ పై మెట్టునుంచి 10 అడుగుల మేర నీటిమట్టం తగ్గింది.