వెల్దుర్తి మండలం లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

100 రోజులలో ఇచ్చిన హామీలను అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు దక్కుతుంది
ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
వెల్దుర్తి సెప్టెంబర్ 24 యువతరం న్యూస్:
వెల్దుర్తి మండలంలోని బోగోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ , జిల్లా తెదేపా అధ్యక్షులు తిక్కారెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుంది అన్నారు. ఈ వంద రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు దక్కుతుందన్నారు. గ్రత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. రూ 4000 లు పింఛన్ పెంచిన కాక చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమర్నాథ్ గౌడ్,నాగేశ్వర రావు యాదవ్, కోట్రికే పని రాజ్, నాగేశ్వర్ రెడ్డి, రామకృష్ణ చారి, రామస్వామి, బాబు గౌడ్, ఆనంద్ యాదవ్ ,సుధాకర్ గౌడ్, తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప, సీఐ మధుసూదన్ రావు, ఎస్సై అశోక్,ఏవో అక్బర్ బాషా,ఎంఈఓ ఇందిర, వైద్యాధికారిణి స్వాతి, మాధవి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి మునెప్ప, పిఆర్ఏఈ సురేంద్రారెడ్డి, ఏపీఓ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.