ఇంటి వంటకాలు మరిపించే పసందైన వంటలు

ఇంటి వంటకాలు మరిపించే పసందైనా వంటలు.
లాస్య రెస్టారెంట్ లో అందరికి అందుబాటు
గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే
కర్నూలు ప్రతినిధి ఆగష్టు 9 యువతరం న్యూస్ :
కర్నూలు శివారు ప్రాంతం, కర్ణాటక – హైదరాబాద్ జాతీయ రహదారి,కిసాన్ ఆగ్రో వద్ద గురువారం యజమాని మధు ఆధ్వర్యంలో లాస్య రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రత్యేక పూజల అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ తాజా వంటకాలతో కష్టమర్ లకు ఉన్నత స్థాయి సేవలు అందించడంలో లాస్య రెస్టారెంట్ ముందుంటుంది అన్నారు.యజమాని మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ లాస్య రెస్టారెంట్ లో శాఖహార మాంసాహార వంటలు అందరికి అందుబాటులో ఉంటాయన్నారు. కావున ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో లాస్య రెస్టారెంట్ సిబ్బంది టిడిపి నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి,మీడియా ఆర్గనైజర్ ఎశ్వంత్ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.