హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం ను కించపరిచిన కదిరే కృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలి

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతంను కించపరిచిన కదిరే కృష్ణను వెంటనే అరెస్టు చేయాలి విశ్వహిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీల డిమాండ్..
పత్తికొండ రూరల్ జూలై 25 యువతరం న్యూస్:
ప్రపంచంలోనే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం విశ్వ వ్యాప్తంగా నిరంతరం గోవిందా గోవిందా అంటూ కొలిచి తలిచే ఆ దేవ దేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి స్వామి వారి సుప్రభాతాన్ని కదిరే కృష్ణ అనే వ్యక్తి అవహేళన చేస్తూ మిడి మిడి జ్ఞానంతో నోటి కొచ్చినట్లు దురుసుగా వ్యాఖ్యలు చేసి సమాజంలో అత్యధిక జనాభా కలిగిన హిందువుల మనోభావాలను తీవ్రంగా కించి పరిచేలా మాట్లాడాడని వెంటనే అరెస్టు చేసి, కేసు నమోదు చేసి శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు వీరరాజులు, బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడులు డిమాండ్ చేశారు.
ఈ సంఘటనకు నిరసనగా కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీలు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ కదిరి కృష్ణను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా న్యాయం చేయాలని స్థానిక పత్తికొండ పోలీస్ స్టేషన్ లో సిఐ మురళీమోహన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం,RDO,MRO ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఈరమ్మకు,PO అధికారి వీరేష్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో RSS జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ రామలింగయ్య, మన్ కీ బాత్ కో కన్వీనర్ కరణం నరేష్,బిజెపి నాయకులు పూనా మల్లికార్జున, శంకరయ్య,హిందూ ధార్మిక సంస్థ నాయకులు సోమన్న, ఉపేంద్ర, నాయుడు, బోయ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.