ఉర్దూ పాఠశాలలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు

ఉర్దూ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు
భారత దేశ సంస్కృతి, ప్రపంచానికి ఆదర్శం:: అబ్దుల్ అజీజ్
నంద్యాల జులై 25 యువతరం న్యూస్:-
మండలంలోని అయ్యలూరు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సి. అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష రాష్ట్ర ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు “శిక్ష సప్తాహ్” ప్రోగ్రాం ను అనుసరించి భారత దేశ సంస్కృత కార్యక్రమాలు ఘనం గా నిర్వహించారు.
వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించారు. దాన్డీయీ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. అబ్దుల్ అజీజ్, ఉపాధ్యాయులు కలీముల్లాహ పాల్గొని విద్యార్థుల ను ఉత్తేజ పరిచారు. తదనంతరం సంస్కృత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అఖిల బాను, షబానా పర్వీన్, వాలీటీర్లు నాసిర, లత, నసీమ, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.