AGRICULTUREANDHRA PRADESHOFFICIAL
అనుమతులు లేని ఫర్టిలైజర్స్ అమ్మితే చర్యలు తప్పవు

అనుమతులు లేని ఫర్టిలైజర్స్ అమ్మితే చర్యలు తప్పవు ::ఏవో
బండి ఆత్మకూరు జులై 25 యువతరం న్యూస్:-మండలంలోని దుర్గ భవాని ఫర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్, మరియు పార్నపల్లి గ్రామంలోని ప్రశాంతి ఫర్టిలైజర్స్ లను మండల వ్యవసాయ అధికారిని స్వాతి ఆకస్మికంగా తనిఖీ చేసి ఫర్టిలైజర్ స్టాక్ ను మరియు రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం ఎం ఏ ఓ మాట్లాడుతూ స్టాక్ బోర్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఫర్టిలైజర్స్ కొన్న ప్రతి రైతుకు రసీదువ్వాలని ఫర్టిలైజర్ యాక్ట్ ప్రకారం అనుమతులు లేని ఫర్టిలైజర్స్ విక్రయించినచో కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.