AGRICULTUREANDHRA PRADESHOFFICIAL
రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెలకు ఉచిత చికిత్స శిబిరం

రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గేదెలకు ఉచిత చికిత్స శిబిరం
బండి ఆత్మకూరు జులై 25 యువతరం న్యూస్:
మండలంలోని సోమయాజుల పల్లె గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా గురువారం పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం డాక్టర్ గౌసియా బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అనూష పాల్గొని గొడ్డు మోతు పశువులకు, ఎదకు రాని
పశువులకు పరీక్షలు నిర్వహించి వాటి నివారణకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ పశువులకు సంక్రమించే వ్యాధుల నివారణ, పశు పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు మేలైన యాజమాన్య పద్ధతి గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ రెడ్డి,లైవ్ స్టాక్ అసిస్టెంట్ మహబూబ్ భాష,AHA లు సమీర, లక్ష్మిప్రసన్న, ఉమామహేశ్వరి వెటర్నరీ అసిస్టెంట్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.