వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలోనికి జంప్

వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ లోనికి జంప్
సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే బీవీ..
ప్రతిపక్షం నుండి అధికారంలోకి కౌన్సిలర్లు..
అయితే..పట్టణ వార్డుల టీడీపీ పార్టీ ఇంచార్జ్ కౌన్సిలర్ల పరిస్థితి…?
“చెడపకురా…. చెడేవు”….ఈ సామెత నిజమైందా..?
వైసీపీ టూ.. టీడీపీ..పై యువతరం న్యూస్ లో ప్రత్యేక కథనం..
ఎమ్మిగనూరు ప్రతినిధి జులై 14 యువతరం న్యూస్:
ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి పక్ష వైసీపీ పార్టీ కౌన్సిలర్లు అధికార పార్టీ టీడీపీలో చేరి కండువ కప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దగ్గర కీలక వ్యక్తి పన్నిన వ్యూహంలో లో చిక్కుకొని టీడీపీ పార్టీకీ సహాయ నిరాకరణ చేసి ఆ పార్టీ యొక్క ట్రాప్ లో పడి వాళ్ళు ఇచ్చే ముడుపులు తీసుకుని పార్టీ మారే ఆలోచనలు చేసి ఆఖరి నిమిషంలో ఏపార్టీ గెలుస్తుందో తేల్చుకోలేక సతమతమై
కొట్టుకోడానికి ఎరాయ్ అయితేనేమి అని పార్టీలో ఉండే పరిస్థితి ఏర్పడిన సంఘటనలు టీడీపీ పార్టీ అధిష్టానం దృష్ఠికి వెళ్లినట్లు సమాచారం.ఈ విషయం పై పట్టణంలో రాజకీయ
విశ్లేషకులుచర్చించుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో అధికారం లో వచ్చిన టీడీపీ పార్టీ పట్టణంలో పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా టీడీపీ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రతి పక్ష పార్టీల కౌన్సెలర్లు చేరికలు జరుగుతున్నట్లు ప్రజల్లో పుకార్లు షికార్లు కొడుతోంది.
ఈ చేరికల పై పట్టణంలో ఉన్న ప్రజలు కూడా “చెడపకురా చెడేవు”..అనే సామెతను అనుకుంటున్నారని రాజకీయ విశ్లేషకలుచర్చించుకుంటున్నారు.ఇప్పటికే పట్టణం లోని కొన్ని వార్డుల వైసీపీ కౌన్సిలర్లు ఇంచార్జ్ లు వారి కార్యకర్తలతో పార్టీలో చేరారు.రాబోయే రోజుల్లో మరి కొద్ది మంది వైసీపీ కౌన్సెలర్లు టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రాజకీయాల్లో చిన్న,పెద్ద నాయకులు వారి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారడం సహజమేనేమో కదా..అవును అంటారా..కాదంటారా…