ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ ఖాజా కు ఎస్ పి కృష్ణకాంత్ ప్రత్యేక అభినందనలు

ఎస్బి హెడ్ కానిస్టేబుల్ ఖజాకు ఎస్పీ కృష్ణ కాంత్ ప్రత్యేక అభినందనలు
కర్నూల్ ప్రతినిధి జులై 14 యువతరం న్యూస్:
వెల్దుర్తి సర్కిల్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ హెచ్ సి 888, ఎస్. ఖాజా హుస్సేన్ ఎన్నికల ముందు భారీ ఎత్తున
నగదు(2.35 కోట్లు ),
బంగారు(4.5 కిలో )
వెండి(5 కిలో)
మరియు
రాష్ర్టంలో దొంగలించబడిన 16 మోటర్ సైకిల్ లను రికవరీ చెయ్యడమే కాకుండా
స్పెషల్ బ్రాంచ్ విధులు యందు ప్రతి ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు,వాస్తవాలను సేకరించి పోలీసు ఉన్నత అధికారులకు తెలిపి, అత్యంత ప్రతిభ కనబరిచినందుకుగాను కర్నూలు జిల్లా ఎస్పి కృష్ణ కాంత్ ఎస్బి హెఢ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్ ను ప్రత్యేకంగా అభినందించారు. వెయ్యి రూపాయల నగదు రివార్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ నాగరాజు యాదవ్, కోసిగి సిఐ ప్రసాద్, డి సి ఆర్ బి సిఐ గుణశేఖర్,, సిఐ రామా నాయుడు,, ఎస్ బి ఎస్ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.